telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

‘ఫణి’ తుపాన్‌ బీభత్సం.. శ్రీకాకుళం జిల్లాలో 38 కోట్ల నష్టం!

fog rain in himachal pradesh

‘ఫణి’ తుపాన్‌ బీభత్సంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. తీవ్రమైన గాలులు, వర్షాలకు ఇళ్లు, పంటలు నాశనమయ్యాయి. విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది. మిగిలిన రంగాలన్నింటితో కలిపి దాదాపు 38.5 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అత్యధికంగా విద్యుత్‌ శాఖకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. కుప్ప కూలిన స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మార్లతో విద్యుత్‌ వ్యవస్థ అంతా ధ్వంసమయిందని, దీనివల్ల 9.75 లక్షల మేర నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

అలాగే తుపాన్‌ ధాటికి 162 ఇళ్లు దెబ్బతిన్నాయని, దీనివల్ల 51.25 లక్షల నష్టం జరిగిందని తేల్చారు. 406 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 1187 హెక్టార్లలో వరి, 555 హెక్టార్లలో వేరుశనగ పంట దెబ్బతినగా 4 కోట్ల 9 లక్షల 48 వేల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, తాగునీటి పైపులైన్లు ధ్వంసం కావడం వల్ల 2 కోట్ల 13 లక్షల 60 వేల రూపాయలు, పశు సంవర్థక శాఖకు 3.49 లక్షల నష్టం జరిగిందని తేల్చారు. తుపాన్‌ సమయంలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, వారికి అవసరమైన ఆహారం, మంచినీటి సరఫరా, ఇతరత్రా అవసరాల కోసం 31 లక్షల 89 వేలు ఖర్చు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Related posts