telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ సీఎం కావాలంటున్న నెటిజన్లు

Anil-Kapoor

తమిళ దర్శకుడు ఎస్ శంకర్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ నాయక్‌ (ఒకే ఒక్కడు రీమేక్‌)లో అనిల్‌ కపూర్‌తో పాటు రాణి ముఖర్జీ, అమ్రిష్‌ పురిలు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో అనీల్ క‌పూర్ ఒక్క రోజు సీఎంగా ఉండి త‌న బాధ్య‌త‌ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాడు. ఈ నేప‌థ్యంలో సూప‌ర్ స్టార్ అనీల్ క‌పూర్ మ‌హారాష్ట్ర సీఎంగా ఉండాలంటూ ట్విట్ట‌ర్‌లో కామెంట్స్ చేశారు. అంతేకాదు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఆదిత్య ఠాక్రేల‌లో ఎవ‌రు సీఎం పీఠం మీద కూర్చోవాల‌ని ఆశ‌ప‌డుతున్నారో, అది తేలేవ‌ర‌కు అనీల్ క‌పూర్‌ని సీఎంగా ఉండ‌మ‌నండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ హంగామా న‌డుమ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించిన అనీల్ క‌పూర్.. నేను నాయక్ సినిమాలో నాయ‌కుడిని మాత్రమే అని కామెంట్ పెట్టారు. దీనికి నెటిజ‌న్స్‌… సినిమాలో ముందు వ‌ద్ద‌ని చెప్పి త‌ర్వాత బాధ్య‌త‌ల‌ని తీసుకున్నారుగా అంటూ ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకంటే… మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో బీజేపీ, శివ‌సేన కూట‌మికి అత్య‌ధిక సీట్లు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. కాని అంత‌లోనే శివ‌సేన త‌మ‌కి రెండున్న‌ర ఏళ్ళు ముఖ్య‌మంత్రి ప‌దవి కావాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర సీఎం పీఠం ఎవ‌రికి ద‌క్కుతుందని సోష‌ల్ మీడియాలో హాట్ హాట్‌గా చ‌ర్చ న‌డుస్తుంది.

Related posts