telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫుట్ బాల్ మ్యాచ్ స్టేడియంలో… 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యువకుడు…!

బ్రెజిల్ లోని సావోపాలోలోగల ఎస్టాడియో సిసిరో పాంప్యూ డి టోలెడో ఫుట్‌బాల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అభిమాని 40 అడుగుల ఎత్తులో ఉన్న స్టాండ్ నుంచి కింద పడ్డాడు. అది కూడా కింది స్టాండ్‌లో ఉన్న 13 ఏళ్ల బాలికపై పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. సావో పాలో, గ్రేమియో జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిందపడ్డ వ్యక్తిని లాగో డి మెలో రియోస్‌గా, బాలికను జియోవానా శాంటాస్ అరౌజోగా గుర్తించారు. కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా… స్టేడియంలోని 40 అడుతుల ఎత్తులో ఉన్న స్టాండ్‌లోంచి ఓ అభిమాని ఆటగాళ్లను చీర్ చెప్పే హుషారులో అక్కడి నుంచి అదుపుతప్పి కింద పడ్డాడు. అది కూడా కింది స్టాండ్‌లో మ్యాచ్ వీక్షిస్తున్న 13 బాలికపై పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని చికిత్స కోసం కాంపో లింబో ఆసుపత్రికి తరలించారు. రియోస్‌ తొడ ఎముక విరిగిందని వైద్యులు వెల్లడించారు. కాగా, జియోవానా మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Related posts