telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రజీనికాంత్‌కు షాక్‌ : మేం మీతో ఉండమంటున్న అభిమాన సంఘాలు..

inquiry on rajinikanth wrt tuthukudi

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ దిమ్మ దిరిగే షాక్‌ ఇచ్చాయి ఆయన అభిమాన సంఘాలు. రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఇవాళ కీలక ప్రకటన చేయబోతున్నారు.  చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయాలలోకి ఎంట్రీపై అనేక కథనాలు వెలువడ్డాయి. 2019 లోనే రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు.  కానీ, రాజకీయాల్లోకి రావటానికి ఇంకా సమయం ఉందని, త్వరలోనే అన్ని విషయాలు చెప్తానని గతంలో పేర్కొన్నారు.  అయితే.. ఈరోజు ఉదయం అభిమాన సంఘాలతో సమావేశం అయ్యారు రజినీకాంత్‌.  కానీ ఈ సమావేశంలో రజినీకాంత్‌ ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అభిమాన సంఘాలు నినాదాలు చేశాయి. మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తామని తేల్చి చెప్పేశారు అభిమాన సంఘాల నేతులు. బీజేపీకి మద్దతు ఇస్తే మేము మీ వెంట నడువలేమంటూ స్పష్టం చేశాయి అభిమాన సంఘాలు. అభిమాన సంఘాల తీరుతో షాక్‌ తిన్న రజినీకాంత్‌.. వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాలు మరింత కాక రేపుతున్నాయి.

Related posts