telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “వినయ విధేయ రామ” ఫ్యామిలీ పోస్టర్

VVR

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ”. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ని కేటీఆర్, చిరంజీవి కలసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. న్యూ ఇయర్ సందర్భంగా చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. రామ్ చరణ్ తన నలుగురు అన్నయ్యలు, వదినలు, వారి పిల్లలతో ఉన్న ఈ ఫ్యామిలీ పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని జనవరి 11న సంక్రాంతి కానుకగా “వినయ విధేయ రామ” చిత్రం పేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ పూర్తయితే రాజమౌళి భారీ మల్టీస్టారర్ కోసం మేకోవర్ అవుతారు రామ్ చరణ్. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను మొదలుపెట్టారు.

Related posts