telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

లవ్ ఎఫైర్ : కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

కడప జిల్లా రాయచోటిలో దారుణం చోటచేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్ళితే…ప్రేమ వ్యవహారం యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన సదరు యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి ఓ యువకుడిని ప్రేమించగా ఆ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధo చూసి పెళ్లి చేసేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇదే విషయమై కుటుంబసభ్యులతో వాగ్వాదం జరిగింది.

ఇదే క్రమంలో మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా నిరాకరించిన యువతి…తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది యువతి… దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు..    యువతి కేకలు వేయడంత స్థానికులు వచ్చి మంటలు ఆర్పేయగా ప్రాణాల నుండి బయటపడింది. తీవ్రంగా గాయపడిన యువతిని కడప రిమ్స్ కు తరలించారు.

Related posts