telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు

కారు/బైక్ కొంటున్నారా.. క్యూ లో ఉండండి.. లక్ష మిగులుతుంది.. !

fame 2 scheme from central govt

కేంద్ర పధకాలు అప్పుడప్పుడు ప్రజలకు ఉపయోగపడతాయి.. అనడానికి అదొక ఉదాహరణ. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టబోతున్న పధకం మీరు కారో లేదా బైకో కొనుగోలు చేస్తుంటే.. దానిలో 20 వేలనుండి లక్ష రూపాయల వరకు ఆదా అవుతుంది. కానీ దానికోసం రెండు వారాలు ఆగాలి, లేదంటే ఆ తరువాత ఎంతో బాధపడవలసి వస్తుంది. అదెలా అంటే, కేంద్ర ప్రభుత్వపు ఫేమ్ 2 పథకం ద్వారా. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీకి సంబంధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు ఈ పథకం అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం రూ.10,000 కోట్లు కేటాయించింది.

ఫేమ్ 2 పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. 35,000 కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందవచ్చు. హైబ్రిడ్ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000-20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు.

fame 2 scheme from central govtaఅలాగే 5 లక్షల ఈ-రిక్షాలకు ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. 7,090 ఈ-బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సీడీ లభించనుంది.

2019-20 సంవత్సరంలో రూ.1,500 కోట్లు, 2020-21లో రూ.5,000 కోట్లు, 2021-22లో రూ.3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు ధరలో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20% ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు.

Related posts