telugu navyamedia
crime news political study news trending

ఏళ్లతరబడిగా నడుస్తున్న … నకిలీ విశ్వవిదాలయం…నిద్రలో అధికారులు..

fake university by a tamilian

దేశవ్యాప్తంగా ఉన్న విద్యాలయాలలోనే సీట్లు మిగిలిపోతున్న దృశ్యం ఒకవైపు, మరోవైపు నకిలీ సర్టిఫికెట్ జారీ ముఠాలు, ఇవి చాలవు అన్నట్టుగా తాజాగా నకిలీ యూనివర్సిటీ లు కూడా తయారవుతున్నాయి. అవికూడా ఏమైనా స్థలాలు ఏర్పాటు చేసి కేవలం ప్రభుత్వ అనుమతికోసం ఎదురుచూస్తున్నవి కాదు. ఇళ్లలో యూనివర్సిటీ అని చెప్పి ఏళ్లతరబడి .. సీట్లు అమ్ముకుంటున్న వైనం ఇది. కొమ్ము కాస్తున్న వారు అధికారులు, కాబట్టి దీనివెనుక ఉన్నది పెద్ద తలకాయలు అని తెలుసుకోవచ్చు. వివరాలలోకి వెళితే, తమిళనాడుకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా నకిలీ విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేశాడు.

ఇష్టానికి నగదు వసూలు చేయడంతో పాటు వేలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీచేశాడు. చివరికి ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది. తమిళనాడులోని నాగపట్నంలో సెల్వరాజ్ అనే వ్యక్తి ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్‌’ పేరుతో ఇంట్లోనే ఓ యూనివర్సిటీని స్థాపించాడు. ఇదే పేరుతో గత ఏడేళ్లుగా దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులకు మెడికల్ డిగ్రీ పట్టాలు జారీచేశాడు. అయితే ఈ వ్యవహారంపై విద్యార్థులతో పాటు అధికారులకు సైతం ఎలాంటి అనుమానం రాలేదు.

ఇటీవల తనిఖీల సందర్భంగా ఈ విశ్వవిద్యాలయం జారీచేస్తున్న సర్టిఫికెట్లపై వైద్య శాఖ ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు యూనివర్సిటీ అడ్రస్ కు వెళ్లి విస్తుపోయారు. ఎందుకంటే ఓ ఇంటి అడ్రస్ తో సెల్వరాజ్ ఈ దొంగ విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిపై దాడి చేసిన అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ఏడేళ్ల పాటు నడిచిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

Related posts

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో.. మహారాష్ట్ర విద్యార్థికి టాప్ ర్యాంక్

vimala p

నిజాయతీ సంప్రదాయాన్ని మోదీ తీసుకొచ్చారు: అరుణ్‌ జైట్లీ 

ashok

కోచింగ్ సెంటర్‌లో  చితకబాడంతో విద్యార్థి మృతి

ashok