• Home
  • వార్తలు
  • నగరంలో నకిలీ మందులు… జర భద్రం…అవి ఇవే…
Trending Today ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

నగరంలో నకిలీ మందులు… జర భద్రం…అవి ఇవే…

fake madicines in cities

కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాలలో అభివృద్ధి ఏదో ఒక పేరుమీద వెనకడుగు వేస్తుంటే మరో వైపు అసాంఘిక శక్తులు కూడా వాటి వెళ్ళాను నాటడానికి ఆరాటం చూపిస్తున్నాయి. అవి అలా పెట్రేగిపోతే ఇక అభివృద్ధి కొండెక్కినట్టే అయిపోతుంది. ఒక పక్క ఒళ్ళంతా కళ్ళు చేసుకొని తనిఖీలు చేస్తున్న అధికారుల కళ్లుగప్పి మరీ గుంటూరు నగరంలో నకిలీ మందుల దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఒక్క నగరంలోనే 17 రకాల నకిలీ మందులు చలామణిలో ఉన్నట్టు ఔషధ తనిఖీ నియంత్రణ శాఖ గుర్తించింది. ఈ మందులలో ప్రధానంగా మధుమేహం, అధిక రక్తపోటు, యాంటీ బయోటిక్, కడుపు ఉబ్బసం తగ్గించేవి, ఎముకల బలానికి వాడేవి ఉన్నాయి. సిప్లా, అరిస్టో, ఆల్కేమ్, సన్ ఫార్మా వంటి ప్రముఖ సంస్థల మందులను పోలివుండటంతో వినియోగదారులు కూడా సులభంగా వీటిబారిన పడుతున్నట్టు అధికారులు గుర్తించారు.

ఈ మందులను రాజస్థాన్ నుండి నగరానికి తెస్తున్నట్టు అధికారులు గుర్తించారు. రాజస్థాన్ డ్రగ్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే నగరంలో ఈ నకిలీ మందులను ఏరివేసే కార్యక్రమం రహస్యంగా చేపడుతున్నారు అధికారులు. నకిలీ మందుల చలామణిలో ఉంటె అక్కడ అధికారులు ఏమి చేస్తున్నారు అని రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ తలలు పట్టుకుంటున్నారు.

Duplicate Medicines, Sales, in Gunturఈ తనిఖీల కు కొద్దీ రోజుల ముందు ఇలాంటి ఆపరేషన్ చేసిన అధికారులకు అప్పుడు కూడా 8 రకాల నకిలీ మందులు చలామణిలో ఉన్నట్టు తేల్చారు. మళ్ళీ తాజాగా చేసిన తనిఖీలలో కూడా నకిలీ మందులు బయటపడటంతో అధికారులు ఆందోళనలో ఉన్నారు. ఈ నకిలీ మందులను ఉత్తరాఖండ్ లోని రూర్కీ లో తయారుచేస్తున్నట్టు అధికారులు ప్రాథమిక తనిఖిలలోనే కనుగొన్నారు. కానీ తాజా మందుల చలామణి రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లతో పాటుగా ఏపీలో కూడా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. రూర్కీలో మూడు నకిలీ మందుల తయారీ కర్మాగారాలను సీజ్ చేశారు.

నకిలీ మందుల జాబితా :
1. కుపాన్-డీ ట్యాబ్లేట్ (పెంటాప్రజోల్, డొమి పేరిడిన్)
2. మాంటెయిర్ -ఎల్.సి. ట్యాబ్లేట్ (మాంటెలుకాస్ట్, వివో సిట్రిజన్)
3. ప్యాంటప్ -డి.ఎన్.ఆర్. క్యాప్సూల్ (ఎంట్రిక్ కోటెడ్ పెంటాప్రజోల్ సోడియం, డోమి పేరిడిన్ ఎస్.ఆర్)
4. ప్యాంటఫ్ -40 ట్యాబ్లేట్ (పెంటా ప్రజోల్ గ్యాస్ట్రో రెసిస్టన్స్)
5. మోనో సేఫ్ ఓ-200 ట్యాబ్లేట్ (సెఫీక్టీమ్ 200ఎం.జి), ఇవి రెండు రకాలు ఉన్నాయట..
6. క్లావెన్ 625 ట్యాబ్లేట్ (ఆయాక్సిసిలిన్, పొటాషియం క్లావెల్వెట్)
7. టాక్సిమ్‌ ఓ-200 ట్యాబ్లెట్లు(సెఫిక్జిమ్‌)
8. ప్యాన్‌ 40 ట్యాబ్లెట్లు(ప్యాంటాప్రెజోల్‌ గ్యాస్ట్రిక్‌ రెసిస్టెన్స్‌)
9. ప్యాంటాసిస్‌ డీఎ్‌సఆర్‌ క్యాప్సుల్స్‌(ఎంట్రిక్‌ కోటెడ్‌ ప్యాంటాప్రజోల్‌ సోడియం, డోమిపెరిడిన్‌)ట
10. అజిప్రైమ్‌ 250(అజిత్రోమైసిన్‌)
11. గ్లిమికట్‌ ఎం ట్యాబ్లెట్లు(గ్లిమిప్రైడ్‌, మెట్‌ఫార్మిన్‌)
12. టెమి-40 ట్యాబ్లెట్లు(టెల్‌మిసార్టిన్‌)
13. కాల్‌జెన్‌ డీ3(ద్రావణం) (క్యాల్షియం కార్బనేట్‌, మెగ్నిషియం హైడ్రాక్సైడ్‌, జింక్‌, కోల్‌కాల్సిఫెరాల్‌)
14. డైక్లోఫెనాక్‌ సోడియం 50ఎంజీ ట్యాబ్లెట్లు
15. సక్సినేట్‌ ఇంజెక్షన్స్‌ 100 ఎంజీ(హైడ్రాకాక్సిటోజోన్స్‌ సోడియం)
16. టాప్‌-డీ ట్యాబ్లెట్లు(పెంటాప్రజోల్‌, డోమిపెరిడిన్‌)

Related posts

ఐక్యరాజ్య సమితి మహిళా కమిషన్ చీఫ్ గా చిలీ అధ్యక్షురాలు… గతంలో కూడా బాధ్యతలు

nagaraj chanti

ఆ సింగర్ పై లైంగిక దాడి చేసింది నిజమే… నిజం ఒప్పుకుంటున్నానంటూ పోస్టులు వైరల్

vimala t

రామాయణంలో పిడకలవేట అంటే…ఇదేనేమో…ఎవరి ప్రచారం వారు చేసుకోకుండా…

chandra sekkhar

Leave a Comment