telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూడ్ వీడియో ఇస్తే సరి.. లేదంటే.. లీక్ .. !

SIT Investigation YS viveka Murder

సిద్ధార్థ్ సరోద్ (28) ముంబైలోని సియాన్ చునాబట్టీలో ఉంటు, కాస్టింగ్ డైరెక్టర్‌గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మపలికేవాడు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా కొత్త హీరోయిన్లతో పరిచయాలు పెంచుకుంటూ వారిని మోసం చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ఇతడికి పరిచమైయింది. తనకు బాలీవుడ్ సినిమాల్లో ఛాన్సులు ఇప్పించమని చాటింగ్‌లో అడిగింది. ఆమె వాట్సాప్ నంబర్ తీసుకొని తప్పకుండ సినిమా ఛాన్స్ ఇప్పటిస్తానని చెప్పి ఆమె ఫొటోస్ అడిగాడు.

ఏంటో సంతోషంతో అమ్మాయి కొన్ని ఫొటోలు లాంగ్, మిడిల్, క్లోజ్ షాట్లు ఉన్నవి అతడికి పంపించింది. వాటిని మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్న సిద్ధార్థ్. పిక్స్ ఆర్ట్ అనే మొబైల్ యాప్‌ ద్వారా వాటిని మార్ఫింగ్ చేసి మంచి ఫొటోస్ ను న్యూడ్ ఫొటోలుగా మార్చేశాడు. ఆ తరవాత ఆ ఫోటోలను ఆమెకే సెండ్ చేసి వాటిని ఇంటర్నెట్‌లో, ఫేస్‌బుక్‌లో ఆమె ఫ్రెండ్స్‌కి పంపిస్తానని బెదిరించాడు. అలా చెయ్యకూడదంటే. నీ న్యూడ్ వీడియోలు పంపాలనీ, లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఒక్కసారి న్యూడ్ వీడియోలు పంపితే, ఇక జీవితంలో తన జోలికి రానని అన్నాడు. దీని తో ఆ అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగింది చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడ్ని అరెస్ట్ చేసి నాలుగు తగిలించగా.. కొత్త విషయాలు బయటకు కక్కాడు. ఇప్పటివరకూ అతడు 8 మంది అమ్మాయిలను ఇలాగే మోసం చేసినట్లు నిజాలు తెలిపాడు.

Related posts