telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

నకిలీ సర్టిఫికేట్ తో ఉద్యోగం పొందిన అత్త.. 20 ఏళ్ల తరువాత పీకించిన కోడలు

చిలికి చిలికి గాలివానలా మారిన అత్త కోడళ్ళ గొడవలో చివరకు కోడలు పంతం నెగ్గిచ్చుకుంది. మధ్యప్రదేశ్ లో నకిలీ మార్క్స్‌షీట్‌తో 20 ఏళ్ల కిత్రం టీచర్ పోస్టు దక్కించుకున్న మహిళపై ఆమె కోడలు ఫిర్యాదు చేసింది. దీంతో అత్తను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ కోడలు కుటుంబంలో చోటుచేసుకుంటున్న కలహాలపై పోలీసులకు పిర్యాదు చేసింది. దీనితో పాటు అత్త ఉద్యోగం పొందినప్పటి నకిలీ మార్క్స్‌షీట్‌ను జతపరిచింది. దానిలో అత్త వయసు, పేరు తప్పులతో ఉంది. ఈ నేపధ్యంలో కలెక్టర్ ఆ ఉపాధ్యాయురాలు ప్రేమలతా గోయల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు.

మురౌనాకు చెందిన ప్రేమలత 1998లో ఉపాధ్యాయురాలిగా నియమితురాలైంది. ఆ సమయంలో ఆమె మార్క్స్ షీటులో తప్పులు చోటుచేసుకున్నాయి. కాగా ఇటీవలే ప్రేమలత కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తరువాత ప్రేమలతకు కోడలుకు మధ్య వివాదాలు మొదలై, కోర్టు వరకూ చేరాయి. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికేట్ తో ఉద్యోగం పొందిన అత్త పై కోడలు పిర్యాదు చేయడంతో ఉద్యోగం ఊడింది.

Related posts