telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ విమానాశ్రయానికి … బాంబు బెదిరింపు…

fake bomb blast call to delhi airport

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కాల్ అదికూడా స్వాతంత్ర్య దినోత్సవానికి సరిగ్గా మూడు రోజుల ముందు కలకలం రేపింది. టెర్మినల్2లో బాంబు పెట్టినట్టు ఫోన్ రావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది టెర్మినల్ 2లోని ప్రయాణికులను ఖాళీ చేయించి సేవలను నిలిపివేశారు.

టెర్మినల్ 2లోని ప్రయాణికలను గేట్ నంబరు 4కు తరలించారు. విమానంలో వచ్చిన ప్రయాణికులను కిందికి దిగకుండా లోపలే ఉంచేశారు. దాదాపు 70 నిమిషాలపాటు బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా గాలించిన తర్వాత అది ఫేక్ కాల్ అని తేల్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts