telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ పేరుతో మెసేజ్… నిజమేనా ?

Allu-Arjun

’’స్కాట్‌లాండ్‌కి చెందిన ఓ యువ‌కుడికి క‌రోనా సోకింది. ఆ వ్య‌క్తి జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో ఆ వ్య‌క్తి ఉంటున్నాడు. ప్ర‌జ‌లు అత‌ని అచూకీ క‌నిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాబ‌ట్టి జూబ్లీహిల్స్‌లోని ప‌బ్లిక్స్ ప్లేసుల‌కు వెళ్ల‌కండి’’ అనే మెసేజ్‌ ఒకటి యాక్ట‌ర్స్ అనానిమ‌స్ అనే గ్రూపులో అల్లు అర్జున్ పోస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే పలువురు సినీ, రాజకీయ‌ ప్ర‌ముఖులు నివ‌సించే జూబ్లీహిల్స్ ప్రాంతంపై కావాల‌నే కొంద‌రు ప‌ని గ‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, అందుకు హీరో అల్లు అర్జున్ పేరుని వాడుకుంటున్నార‌ని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts