telugu navyamedia
health Sexual Problems

రతిలో వైఫల్యం నేను పనికి రానేమోనన్న భయం నేనేం చేయాలి?

Benefits of sex

నాకు పెళ్లయి రెండేళ్లయ్యింది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. గర్భం దాల్చాలంటే నిర్దిష్టమయిన రోజుల్లోనే సెక్స్ చేయాలని మా ఆవిడ ఎక్కడో చదివింది. ఆ ప్రకారంగా ఆయా రోజుల్లో సెక్స్ చేయడానికి ప్రయత్నించినపుడు నేను సరిగ్గా చేయలేకపోయాను. రతిలో వైఫల్యం నేను సెక్స్‌కు పనికి రానేమోనన్న భయం ఏర్పడింది. ఈ విషయం ధ్రువీకరించుకోడానికి నేను బయట ఒక వేశ్యతో కలిసాను. ఫలితంగా నాకు గనేరియా సోకింది. డాక్టర్ గారు నాకు మందులిచ్చి రెండు నెలలు పాటు వాడమని చెప్పారు. మందులు వాడుతున్న రోజుల్లో, భార్యతో సెక్స్ చేయవద్దని సూచించారు. అందువల్ల ఆమెకు కూడా వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదంతా నేను నా భార్యకు చెపకోలేని పరిస్థితి. పిల్లలు కావాలనుకుంటున్నప్పట్నుంచి, నేను సెక్స్ పట్ల సరిగ్గా ప్రవర్తించలేకపోవడం వల్ల ఆమె నన్ను అపార్ధం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి?

కొంతమందిలో తప్పనిసరిగా సెక్స్ చేయాలనే నిబంధన ఉన్నపుడు సహజంగా రతిలో వైఫల్యం చెందడం జరుగు తుంది. ఈ కారణంగా సెక్స్‌కు పనికిరాననే అభిప్రాయానికి రావడం మీరు చేసిన మొదటి తప్పయితే, ఆ విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి మీరంతట మీరే ప్రయత్నించడం, వేశ్య దగ్గరకు వెళ్లడం మరో తప్పు! ప్రస్తుతం ఇదంతా మీ భార్యకు చెప్పకపోవడం మీరు చేస్తున్న మూడో తప్పు. మీ భార్య మిమ్మల్ని అర్ధం చేసుకోదేమోనన్న భయం మీకు ఉం డడం నిజమే కానీ అందువల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నపుడు, మీరు తాత్సారం చేయడం మంచిది కాదు. మీ భార్యకు వెంటనే జరిగిందంతా చెప్పండి. మీరిలా ఎందుకు చేయాల్సివచ్చిందో ఆమెకు వివ రించండి. కావాలని మీరు చేసిన తప కాదు కాబట్టి ఆమె అర్థం చేసుకుంటుంది. అయినా సరే మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోదేమోనన్న అనుమానం ఉంటే, మీ దగ్గర్లో వున్న సెక్స్ కౌన్సిలర్‌ను కలవండి.

Related posts

వారం క్రితమే అంగస్తంభన… ఇప్పుడు మరో సమస్య

vimala p

అజీర్తి సమస్యలకు .. ఈ ఆహారంతో చెక్ పెట్టండి .. !

vimala p

భోజనం తరువాత.. ఇలాంటి పనులు.. తూచ్..!!

ashok