telugu navyamedia
సాంకేతిక

ఓపెన్‌ అయిన సోషల్‌ మీడియా యాప్స్..

ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ సేవలు సోమ‌వారం రాత్రి తొమ్మిది గంటల నుంచి నిలిచిపోయాయి. దీంతో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఇబ్బందులు పడ్డారు. అత్యధిక యూజర్‌బేస్ కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కావడంతో నెటిజెన్స్ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ట్విటర్ ద్వారా పోస్టులు హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి పెట్టారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అవడంపై ట్విటర్‌లో భారీ సంఖ్యలో మీమ్స్ వైరల్ అయ్యాయి.

దీంతో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్స్ తమ ట్విటర్ హ్యాండిల్ ఖాతాల ద్వారా గ్లోబల్ ఔటేజ్‌పై స్పందించాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ సేవలకు అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నట్టు ప్రకటించింది. ఏదో తప్పు దొర్లింది.. దాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం.. ఫేస్ బుక్ తమ అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా మంగళవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేస్తున్నాయి. 7 గంటల తర్వాత ఫేస్‌బుక్‌ తన సేవలను పునరుద్దరించింది.ఈ 3 సోషల్ నెట్‌వర్క్ యాప్స్‌ తిరిగి పనిచేయడం ప్రారంభించడంతో యూజర్లు చాటింగ్, షేరింగ్స్‌, కామెంట్స్, లైక్స్ తిరిగి ప్రారంభించారు. అయితే కొద్దిసేపు ఈ మూడు యాప్స్‌ పనిచేయకపోవడంతో ప్రపంచం స్తంభించిపోయినట్లయింది. నెటిజన్లు మొత్తం ఆగమాగం అయ్యారు.

 

Related posts