telugu navyamedia
వార్తలు సామాజిక

ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్.. పాస్ వర్డ్ లు మా ఉద్యోగులకు తెలుసు!

Facebook shocking comments

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోట్లాది మంది ఖాతాదారుల పాస్ వర్డ్ లు తమ ఉద్యోగులకు కనిపిస్తుంటాయని చెప్పింది. ఇంటర్నల్ సర్వర్లలో వాటిని దాచామని ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ పాస్ వర్డ్ లు ఫేస్ బుక్ బయటివారికి ఎన్నటికీ కనిపించవు. ఉద్యోగులకు కనిపిస్తుంటాయి. వాటిని మా ఉద్యోగులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఇంతవరకూ లేవని సంస్థ ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనాహువాటి తన బ్లాగ్ లో వెల్లడించారు.

ఉద్యోగులకు పాస్ వర్డ్ లు కనిపిస్తాయన్న విషయాన్ని ఈ సంవత్సరం ప్రారంభంలోనే తాము తెలుసుకున్నామని ఆయన చెప్పడం గమనార్హం. ఇప్పటికే డేటా భద్రతపై అందోళన వెల్లువెత్తుతున్న వేళ, పాస్ వర్డ్ లను ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్ లో సర్వర్లలో దాచామని, అవి సంస్థ ఉద్యోగులకు తప్ప మరొకరికి కనిపించవని చెప్పడం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు మండిపడుతున్నారు.

Related posts