telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

ఫేస్ బాబుకు.. జన్మదిన శుభాకాంక్షలు..

Mark Zuckerberg

ఫేస్‌బుక్ రాకముందు, వచ్చిన తర్వాత. ప్రపంచం మొత్తాన్ని ఒకే డిజిటల్ ప్లాట్ ఫామ్‌ పైకి తెచ్చిన ఘనత మార్క్ జుకర్‌బర్గ్‌కే దక్కుతుంది . బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టిగా ఈయన తయారుచేసిన ఒక అప్లికేషన్ గత రెండు దశాబ్దాలుగా అంతర్జాలాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. ఒక్క ఐడియాతో తన జీవితంతో పాటు కొట్లాది మంది జీవితాలని కూడా మార్చిన మార్క్ జుకర్‌బర్గ్ పుట్టిన రోజు నేడు.

చిన్నప్పటినుంచే మార్క్ చదువులో చురుకు. 12 ఏళ్ల వయసులోనే సాంకేతికతకు సంబంధించిన అంశాల మీద పట్టు సంపాదించాడు. స్కూలులో ప్రోగ్రామింగ్ మీద ఎక్కువగా దృష్టి సారించి ప్రపంచం అంతా ప్రోగ్రామర్స్ మరియు యూజర్స్ గా విడిపోయిందని, ప్రోగ్రామర్ గా మారితే భవిష్యత్తులో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించి ఒక కంప్యూటర్ ను కొన్నాడు.

మార్క్ తండ్రి తన బిడ్డ ప్రతిభను 13వ ఏటనే గుర్తించాడు. మార్క్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ వయసులోనే ఒక మెసెంజర్ ను తయారుచేసాడు. డెస్క్ టాప్ మెసెంజర్ గా పనిచేసే ఈ అప్లికేషన్ ద్వారా మార్క్ తండ్రి తన క్లినిక్ లో వచ్చే పేషెంట్ల వివరాలను రిసెప్షనిస్టుల ద్వారా తెలుసుకునేవాడు. అలా టెక్నాలిజీలో ఎప్పుడూ కొత్త, కొత్తవి రూపొందిస్తూ ముందుకు సాగిన మార్క్‌కు 2003 లో చేసిన ఒక పని అతని కెరీర్‌నే మలుపుతిప్పింది. హార్వర్డ్ యూనివర్సిటీ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి దానిలో ఉన్న అమ్మాయిల ఫొటోలను ఎదురుగా పెట్టి ‘వీరిలో ఎవరు అందంగా ఉన్నారు’ అనే క్యాప్షన్ జత చేసి పెట్టాడు. కొద్ది గంటల్లోనే క్యాంపస్ అంతా ఆ వెబ్ సైట్ ను చూడడం మొదలుపెట్టారు. ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల సైట్ క్రాష్ అయిపోయింది. మార్క్ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకొని యూనివర్సిటీ బయటికి పంపేసింది.

హార్వర్డ్ లో మార్క్, దివ్య నరేంద్ర, కామెరూన్ లతో సమావేశం అయ్యాడు. దీనిలో హార్వర్డ్ లో చదువుతున్న అందరి కోసం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలని అనుకున్నారు. దీని ద్వారా స్నేహితులంతా ఫొటోలు, డాక్యుమెంట్లు పంపుకోవడానికి వీలుండేలా వేదికను తయారుచేద్దామనుకున్నారు. కానీ కొంత కాలానికి వారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మార్క్ కు దివ్య నరేంద్ర చెప్పిన ఐడియా మాత్రం బాగా నచ్చింది. ఎలాగైనా దీన్ని డెవలప్ చేద్దామనుకొని 2004 లో ద ఫేస్‌బుక్.కాం అనే డొమెయిన్ ను రిజిస్టర్ చేయించాడు. దాన్ని హార్వర్డ్ విద్యార్థులకు అనుగుణంగా తయారు చేసాడు. అతి తక్కువ సమయంలోనే హార్వర్డ్ లోని 4000 మంది యూజర్లుగా చేరిపోయారు. కాలేజి హాస్టల్లోనే చిన్నపాటి కంప్యూటర్ తోనే ఫేస్‌బుక్ ప్రస్థానం అలా మొదలైంది. ఆ తర్వాత అది విస్తరించిన పరిణామ క్రమం, ప్రజలకు ఎంత చేరువైందో మనందరికి తెలిసిందే.

Related posts