telugu navyamedia
సినిమా వార్తలు

“ఎఫ్-2″లో డిలీటెడ్ సీన్… మెహ్రీన్ ముద్దు సీన్లు మిస్

F2

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన “ఎఫ్-2” చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ లకు జోడిగా తమన్నా, మెహ్రీన్ లు నటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ చిత్రం ఇటీవలే యాభై రోజుల వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందనతో “ఎఫ్-2” సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. తాజాగా “ఎఫ్-2” సినిమాలో తొలగించిన సన్నివేశాన్ని దిల్ రాజు తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఈ వీడియోలో వెంకీ, తమన్నా, మెహ్రీన్ ల మధ్య వచ్చే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు మెహ్రీన్ ముద్దు సీన్లు మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి. 

Related posts