telugu navyamedia
సినిమా వార్తలు

ఎఫ్-2 : డిలీటెడ్ సీన్-3… సింగింగ్ లో హనీ నేషనల్స్ కు అంట…!

F2 Movie pre release event images

“ఎఫ్-2” చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ లకు జోడిగా తమన్నా, మెహ్రీన్ లు నటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ చిత్రం ఇటీవలే యాభై రోజుల వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందనతో “ఎఫ్-2” సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. తాజాగా “ఎఫ్-2” సినిమాలో తొలగించిన సన్నివేశాన్ని “ఎఫ్-2″ : డిలీటెడ్ సీన్-3” అంటూ దిల్ రాజు తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఈ వీడియోలో వెంకీ, వరుణ్, మెహ్రీన్, తమన్నా, పెళ్ళికి వచ్చిన బంధువుల మధ్య వచ్చిన సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పెళ్ళికి ముందు సంగీత్ లో మెహ్రీన్ “ఆకాశం బద్దలైన…” అనే సాంగ్ పాడుతుంది. ఈ పాట వల్ల ఎవరెవరికి ఏమైందో ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది. అయితే ఈ వీడియో సినిమాలో డిలీట్ చేయకుండా బాగుందేమో అంటున్నారు ప్రేక్షకులు.

Related posts