telugu navyamedia
సినిమా వార్తలు

వచ్చే సంక్రాంతికి “ఎఫ్-3”

a video song from f2 movie

ఎఫ్ -2 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఎఫ్-2” ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. పూర్తి హాస్యభరితంగా నిర్మితమైన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డు సృష్టిస్తోంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మింతమైన ఈ చిత్రం ఇప్పటికి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ గా “ఎఫ్ 3” ఉంటుందని అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ అన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. “అభిమానులు నా నుంచి ఆశిస్తున్నట్టుగానే ‘ఎఫ్ 3’ సినిమా ఉంటుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన లైన్ ను డెవలప్ చేస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, గన్ మ్యాన్ పాత్రల నిడివి ‘ఎఫ్ 3’లో ఎక్కువగా ఉంటుంది. దిల్ రాజు గారి బ్యానర్లో నేను చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడానికి కారణం ఆయన నాకు ఇచ్చిన స్వేచ్ఛ. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తున్నాను. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆయన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటాను. ఆయనకి గల అనుభవాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తూనే వుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Related posts