telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వ్యాయామంతో .. చదువు వస్తుందట.. తెలుసా..!

exercise is very important for kids also

నిత్యం వ్యాయామం అనే అలవాటు మ‌న ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. అలాగే స‌రైన స‌మ‌యానికి అన్ని పోష‌కాల‌తో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అలాగే నిత్యం వ్యాయామం కూడా చేయాలి. దీని తో శారీర‌కంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది.

కేవ‌లం పెద్ద‌లు మాత్ర‌మే కాదు, పిల్ల‌లు కూడా వ్యాయామం చేస్తే అనేక లాభాలు ఉంటాయ‌ట‌. ముఖ్యంగా వారు చ‌దువుల్లో ఎక్కువ‌గా రాణిస్తార‌ట‌. ఈ విష‌యాన్ని సైంటిస్టులు చేపట్టిన తాజా ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. కొంద‌రు యూనివ‌ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన సైంటిస్టులు పిల్ల‌ల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు.

exercise is very important for kids alsoనిత్యం వ్యాయామం చేసే పిల్ల‌లు, చేయ‌ని పిల్ల‌ల‌కు సంబంధించి.. వారు చ‌దువుల్లో ఎలా రాణిస్తున్నారు.. అనే విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. దీనితో తేలిందేమిటంటే.. నిత్యం కనీసం 60 నిమిషాల పాటు వ్యాయామం చేసే పిల్ల‌లు చ‌దువుల్లో కూడా బాగా రాణిస్తార‌ని తెలుసుకున్నారు.

అందువ‌ల్ల పిల్లల్ని రోజూ క‌నీసం 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేసేలా ప్రోత్స‌హించాల‌ని, లేదా క‌నీసం ఆట‌లు ఆడుకునేందుకు అయినా పెద్ద‌లు అనుమ‌తించాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. దీంతో వారు చ‌దువుల్లో బాగా రాణిస్తార‌ని అంటున్నారు.

Related posts