telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇమ్రాన్ ఓ తోలుబొమ్మ.. మాజీ భార్య రేహాంఖాన్

Ex-wife sensational comments to Imaran

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై అతని మాజీ భార్య రేహాంఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భర్త, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పపెట్ (తోలుబొమ్మ) అని రేహాంఖాన్ వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై ప్రకటన చేసేందుకు పాక్ మిలటరీ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఇమ్రాన్ ఖాన్ ఎదురు చూశారని ఆమె ఆరోపించారు. ఇమ్రాన్ సిద్ధాంతాలతో రాజీపడి అధికారంలోకి వచ్చారని ఆమె అన్నారు.

పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఏం మాట్లాడాలన్నా మిలటరీ అధికారుల వైపు చూస్తారని చెప్పారు. బ్రిటీష్ పౌరురాలైన రెహామ్ ఖాన్ గతంలో పాత్రికేయురాలిగా పనిచేశారు. 2015లో ఇమ్రాన్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న పది నెలలకే అతని నుంచి విడాకులు తీసుకున్నారు. ఇమ్రాన్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Related posts