telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు మాజీ భార్య మద్దతు

kalki

నటి పాయల్‌ ఘోష్‌ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనపై అత్యాచారం చేయబోయాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందిస్తూ వెంటనే అనురాగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బాలీవుడ్ లో‌ ఇలాంటివి సర్వసాధారణమని, ఇకనైన ఇలాంటి ఘటనలపై స్పందించాలన్నారు. అయితే ఈ వివాదంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్‌ నటీనటులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య నటి కల్కి కోచ్లిన్‌ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. “ప్రియమైన అనురాగ్‌ సోషల్‌ మీడియాల్లో వస్తున్న పుకార్లను మీరు పట్టించుకోకండి. మీ స్కిప్ట్‌లో మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా పరిశ్రమలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. దానికి నేనే సాక్ష్యం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చుశారు. మన విడాకుల తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను నా వర్క్‌ ప్లేస్‌లో అసౌకర్యం, అసురక్షితకు లోనైనప్పుడు మీరు నాకు మద్దతుగా నిలిచారు. ఈ సమయం చాలా ప్రమాదకరమైనది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ విమర్శించడం, తప్పుడు వాదనలు చేస్తారు. ఇది స్నేహితులను, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది. అలాగే అవసరమైన సమయంలో ప్రేమ పంచే మనుషులే కాకుండా.. చూట్టు ఎవరూ లేనప్పుడు దయ చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. అయితే అలాంటి గౌరవానికే మీరు కట్టుబడి ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి” అంటూ ఆమె సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన విడుదల చేశారు.

 

View this post on Instagram

 

@anuragkashyap10

A post shared by Kalki (@kalkikanmani) on

Related posts