telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ

Ex-president of India Pranab comments elections

సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఏఐఎంఏ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ దేశ ప్రజలు కోరుకునే సంక్షేమ పాలనను అందించేవారే దేశానికి కావాలన్నారు. పేదరికాన్ని పారద్రోలడానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చని అంచనా వేశారు. ఇండియాలో కేవలం ఒక శాతం మంది ప్రజలు మాత్రమే 60 శాతం సంపదను అనుభవిస్తున్నారని తెలిపారు.

పేదరికాన్ని తరిమేసేందుకు కార్పొరేట్ సంస్థలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని అన్నారు. ఇండియాలో ధనిక, పేద తరగతుల మధ్య ఆంతర్యం చాలా అధికమన్నారు. ఓ సాహసం చేయడం ద్వారా ప్రజల మెప్పును పొంది అధికారంలోకి రావాలనుకుంటే అది అతిపెద్ద పొరపాటు అవుతుందన్నారు. సాహసం ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ప్రజలు భారీగా అంచనాలు పెంచుకుంటారని, అప్పుడు అంతకన్నా పెద్ద సాహసం చేస్తేనే ప్రజలు హర్షిస్తారని ఆయన అన్నారు.

Related posts