• Home
  • వార్తలు
  • రామోజీరావు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది!: ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు వార్తలు

రామోజీరావు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది!: ఉండవల్లి

Undavalli Comments Ramoji Rao

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో అధినేత రామోజీరావు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌పై గతంలో విధించిన స్టేను పొడిగించాలని కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి కేసును వెలుగులోకి తెచ్చిన అరుణ్ కుమార్ స్పందించారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవస్థాపకులు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై ప్రధానంగా రెండు కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమించి బయటి వ్యక్తుల నుంచి నిధులను సేకరించడం, వాటిని తన వద్ద ఉంచుకున్నట్లు రామోజీరావుపై అభియోగాలు ఉన్నాయని వెల్లడించారు.ఈ వ్యవహారంపై కేసు నమోదు కావడంతో ప్రజల నుంచి సేకరించిన రూ.2,600 కోట్ల డిపాజిట్లలో 99 శాతం నగదును వెనక్కి ఇచ్చేసినట్లు రామోజీరావు చెప్పారని ఉండవల్లి అన్నారు. అయితే కేసుల్లో సివిల్ ప్రొసీడింగ్స్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు.

నగదు వెనక్కు ఇచ్చేసినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఎంత డిపాజిట్లు వేశారో దానికి రెండున్నర రెట్లు అంటే రూ.6,500 కోట్లు కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా ఏ స్టే అయినా 6 నెలల్లో ముగుస్తుందని స్పష్టం చేశారు.అలాగే రెండేళ్ల జైలుశిక్ష కూడా పడేసే అవకాశముందన్నారు. అయితే ఈ క్రిమినల్ విచారణపై సీఆర్పీసీ సెక్షన్ 291 కింద మార్గదర్శి సంస్థ హైకోర్టులో స్టే తెచ్చుకుందని పేర్కొన్నారు.

Related posts

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అభిశంసన తప్పదా?

admin

దీప్తి దెబ్బకు నాని దండం పెట్టి పరార్… హౌస్ నుంచి అమిత్ అవుట్

jithu j

ఈ ప్రశ్నకు బదులేది ?

chandra sekkhar

Leave a Comment