telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మృతి

Accident

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు దుర్మరణం చెందారు.శుక్రవారం సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన తోటి మిత్రులు, కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే బలిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారని తెలుసుకున్న ఆప్తులు, అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. బలిరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన సత్యారావు అప్పట్లో విశాఖ కీలకనేతగా ఉన్నారు.

Related posts