telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రిషభ్‌పంత్‌ కి .. మాజీ క్రికెటర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ సలహాలు..

ex cricketer faruq on rishab panth

మాజీ క్రికెటర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌ అపార ప్రతిభావంతుడని ప్రశంసించారు. అతడి టెక్నిక్‌లో మాత్రం కొంత లోపం ఉందన్నారు. దానిని సవరించుకుంటే అతడింకా మెరుగైన కీపర్‌గా అవతరిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ముంబయిలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో జరిగిన క్రికెటర్‌ దిలీప్‌ సర్దేశాయ్‌ స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు.

ప్రపంచకప్‌ సమయంలో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో రిషభ్‌పంత్‌ను కలిశాను. మేమిద్దరం అరగంట మాట్లాడుకున్నాం. అతడు నాతో రెండు, మూడు నెట్‌ సెషన్లు శిక్షణ తీసుకుంటే సరిపోతుందని అనిపించింది. అప్పుడతను మరింత మెరుగైన వికెట్‌కీపర్‌గా తయారవుతాడు. నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. ఐతే ఒకరి పాత్రను మరొకరు పోషించొద్దు. జట్టుకు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచులున్నారు. కానీ వికెట్‌ కీపింగ్‌ గురించి పంత్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌ ఏం చెబుతాడు? ఆ యువ ఆటగాడిని విమర్శించేందుకే అందరూ ఉన్నారు. అతడిపై చాలా ఒత్తిడి ఉంది. ఆ యువ కీపర్‌ను అభివృద్ధి చేయాలి. పంత్‌ చాలా తెలివైన వికెట్‌కీపర్‌. అతడి టెక్నిక్‌లోనే కాస్త లోపం ఉంది అని ఫరూక్‌ అన్నారు.

Related posts