హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన అజారుద్దీన్ ఇప్పుడు కేటీఆర్ ను కలవటం రాజకీయంగా చర్చకు కారణమైంది. కొద్ది రోజులుగా అజారుద్దీన్ టీఆర్‌ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం జరిగుతోంది. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో తమ పార్టీ నుండి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన మాజీ ఎంీ వివేక్ ను ఓడించేందుకు అజారుద్దీన్ కు మద్దతు ఇచ్చేలా టీఆర్‌ఎస్ తో ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఆయన టీఆర్‌ఎస్ లో చేరే విధంగా అంగీకరించారని సమాచారం.
అజారుద్దీన్ కోరుకున్న విధంగా హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. దీనితో ఆయన టీఆర్‌ఎస్ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచిన అజారుద్దీన్ ప్యానల్ మొత్తం కేటీఆర్ తో సమావేశం అయింది. ఈ సమావేశంలో తాము క్రికెట్ కోసం తీసుకొనే చర్యలు మద్దతు కోరామని అజారుద్దీన్ చెబుతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ అజార్ సమావేశం కానున్నారు.