బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, సినీనటుడు అజాజ్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలు మతాల మధ్య కలహాలు ప్రేరేపించేవిగా ఉన్నాయని ముంబై క్రైంబ్రాంచ్ సైబర్ విభాగానికి ఫిర్యాదులు రావడంతో వారు అజాజ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా కావాలనే రెచ్చగొట్టే వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు అజాజ్ ఖాన్. ఈయన పోస్ట్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా కొన్ని మతాల మధ్య కలహాలు రేపేలా ఉన్నాయని ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ విభాగానికి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే అది నిజమే అని తేలింది. అజాజ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2018 అక్టోబరులో కూడా ముంబైలోని ఓ హోటల్లో డ్రగ్స్ కేసులో అతన్ని పట్టుకున్నారు పోలీసులు. ఇక 2016లో ఓ బ్యూటీషియన్‌కు అసభ్య సందేశాలతో పాటు అశ్లీల ఫోటోలు కూడా పంపిన కేసులో అజాజ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. సినిమాలు, కామెడీ సీరియల్స్‌లలో నటిస్తున్న అజాజ్ ఖాన్‌ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు.
previous post