telugu navyamedia
సినిమా వార్తలు

హీరోయిన్ పై మాజీ ప్రియుడి రివేంజ్

Preeti-Zinta

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింతాకు ఇటీవల ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందంటే… ఐపీఎల్ లో భాగంగా మోమాలిలో ఢిల్లీ, కింగ్స్ ఎలెవన్ పంజాబీల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఎయిర్ పోర్టుకు చేరుకుంది ప్రీతీజింతా. అయితే గోఎయిర్ ఫ్లైట్ లో ప్రీతీ ఎక్కడానికి వీలులేదని అక్కడి సిబ్బంది ఆమెకు చెప్పడంతో షాక్ కు గురైంది. గోఎయిర్ విమాన సంస్థకు యజమాని నెస్ వాడియా. అయితే గతంలో ప్రీతీ జింతా అతడితో ప్రేమాయణం సాగించింది. అదికాస్తా బెడిసి కొట్టడంతో గోఎయిర్ లో ప్రయాణించకుండా నెస్ వాడియా ఆమెపై ఆంక్షలు విధించారట.

దీంతో విమాన సిబ్బంది ప్రీతీని గోఎయిర్ ఫ్లైట్ లో ప్రయాణించకుండా అడ్డుకున్నారు. ప్రీతికి బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె ఓ రేంజ్ లో మండిపడ్డారు. కానీ సిబ్బంది వెనకడుగు వేయకపోవడంతో ప్రీతీ ఎయిర్ పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవంతో ఇకపై గోఎయిర్ విమానంలో ప్రయాణించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Related posts