telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈవీఎంలకు ఎలుకల ముప్పు: కూటమి అభ్యర్థి

OU students wrote letter to EC

పోలింగ్ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌పార్టీ(కూటమి) అభ్యర్థి, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత కుంవర్ నరేంద్ర సింగ్ ఈవీఎంల భద్రతపై ప్రశ్న లేవనెత్తారు. మధుర జిల్లా ఎన్నికల అధికారి సర్వజ్ఞరామ్ మిశ్రాకు ఇచ్చిన వినతిపత్రంలో కుంవర్ సింగ్ నరేంద్ర ఎలుకల విషయం పేర్కొన్నారు.

  • మండీ పరిధిలో నిల్వవుంచే ఆహారధాన్యాల కారణంగా అక్కడి ఎలుకలు ఈవీఎంలకు నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు. దీనిపై స్పందించిన సర్వజ్ఞరామ్ మిశ్రా మాట్లాడుతూ నరేంద్ర ఆరోపణలు అర్ధంలేనివని కొట్టిపారేశారు. తాము ఈవీఎంల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా రెండవ దశలో మధురలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి బీజేపీ తరపున హేమమాలిని, కాంగ్రెస్ నుంచి మహేష్ పాఠక్ ఎన్నికల బరిలో ఉన్నారు.

Related posts