telugu navyamedia
news political Telangana

ఈవీఎం మోసాలపై సీఈసీకి ఫిర్యాదు!

T Congress boycott mlc elections

అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం మోసాలపై ఓడిన అభ్యర్థులందరినీ ఢిల్లీ తీసుకెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయించాలని టీపీసీసీ యోచిస్తోంది. ప్రభుత్వం రద్దయిన నాటి నుంచి కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని, వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై విన్నవించినా పట్టించుకోలేదని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికొచ్చింది. శుక్రవారం గాంధీభవన్‌లో ఎన్నికల ఓటమిపై కాంగ్రెస్‌ సమీక్షించింది.

ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ప్రేమ్‌సాగర్‌రావు, ఆరేపల్లి మోహన్, రమేశ్‌ రాథోడ్, తాహెర్‌బిన్, ఆత్రం సక్కు, అద్దంకి దయాకర్‌ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మూడు దశలుగా సమీక్షించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో పాటు ఇతర అంశాలపైనా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.

ఎన్నికల్లో ఈవీఎం మోసాలపై తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీనియర్‌ నేత ప్రేమ్‌సాగర్‌రావులతో కమిటీని ఏర్పాటు చేశారు. పోలింగ్‌ స్టేషన్ల వారీగా నమోదైన ఓట్లు, కౌంటింగ్‌ నివేదికలను ఈ కమిటీ తెప్పించుకుని అధ్యయనం చేయనుంది.

Related posts

తీరం దాటిన ఫణి తుపాను..ఒడిశా దిశగా పయనం

vimala p

వణికిస్తున్న.. చలి.. మళ్ళీ పెరిగిపోతుంది…తెలుగులో మరీను..

vimala p

చెరువు కబ్జాపై ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్

ashok