telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

12 మంది పిల్లలను కట్టేసి, తల్లిదండ్రులే అత్యంత్య హీనంగా…

Evil-Parents

ఉన్నత చదువులతో సమాజంలో గౌరవంతో జీవిస్తున్న దంపతులు వారు. కానీ వారికి పిల్లలున్నట్లుగా పక్కింటి వారికి కూడా తెలియదు. తెలిసిన వాళ్ళెవరైనా అడిగితే తమ పిల్లలకు ఇంట్లోనే చదువు చెప్తున్నామని, తాము నడిపే స్కూలు తరఫునే పరీక్షలు రాయిస్తున్నామని చెప్తూ వచ్చిన వారి ఇంటిపై ఓ రోజు హఠాత్తుగా పోలీసులు దాడి చేశారు. దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకొని, వారి ఇంట్లో నుంచి పన్నెండు మంది పిల్లల్ని బయటకు తీసుకొచ్చి సంక్షేమ గృహాలకు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే… ఆ దంపతులకు పదమూడు మంది సంతానం. వారందరినీ చైన్లతో మంచాలకు, కుర్చీలకు కట్టేసి కొట్టడం ఆ తల్లిదండ్రులకు అలవాటు. పిల్లల్ని ఇంటి బయటకు కూడా పంపించకుండా ఇనుప బోనుల్లో పడేసి, జంతువుల్లా పెంచారు. ఆహారం పెట్టకుండా రోజుల తరబడి పస్తులుంచి, చిత్రహింసలు పెట్టేవారు. వారి చెర నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకొన్న వారి కుమార్తె.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు షాక్ తగిలింది. చెత్తాచెదారంతో అత్యంత నీచంగా ఉన్న బోనుల్లో పిల్లలుండటం చూసిన వారికి, ఆ తల్లిదండ్రులంటే అసహ్యమేసింది. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇటీవలే వారికి శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం, ఆ దంపతులకు జీవితఖైదు విధించింది. తామెప్పుడూ తమ పిల్లలను కష్టపెట్టాలని అనుకోలేదంటూ ఆ దంపతులు కోర్టులో కన్నీళ్లు కార్చడం ఆశ్చర్యకరం.

Related posts