telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

లెక్కింపుకు అంతా సిద్ధం… భారీ భద్రత … 144 సెక్షన్ ..

everything is ready for tomorrow counting

ఎన్నికల నగారా మోగినప్పటినుండి అందరూ ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. రేపటి ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెల్లడి కావడానికి ఇక గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో క్షణక్షణానికి ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) భద్రపర్చారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 6 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గురువారం స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి, పక్కనే ఉన్న కౌంటింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 25,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. భద్రత కోసం 25,000 మందికిపైగా పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి:

శ్రీశివానీ ఇంజనీరింగ్‌ కాలేజ్, చిలకపాలెం,శ్రీకాకుళం: పాలకొండ(ఎస్‌టీ), ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం(ఎస్‌సీ)
ఎంవీజీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, చింతలవలస, విజయనగరం: కురుపాం(ఎస్‌టీ), పార్వతీపురం(ఎస్‌సీ), సాలూరు(ఎస్‌టీ), శృంగవరపుకోట.
ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్, విశాఖపట్నం: అరకు వ్యాలీ(ఎస్‌టీ), పాడేరు(ఎస్‌టీ), భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, గాజువాక, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి,
యలమంచిలి, పాయకరావుపేట(ఎస్‌సీ), నర్సీపట్నం
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కాకినాడ: రంపచోడవరం(ఎస్‌టీ)
జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విజయనగరం: బొబ్బిలి, గజపతినగరం
లెండి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, జొన్నాడ,
విజయనగరం: చీపురుపల్లి, నెల్లిమర్ల
పోలీస్‌ ట్రైయినింగ్‌ కాలేజ్, కంటోన్మెంట్, విజయనగరం: విజయనగరం
జేఎన్‌టీయూ–కాకినాడ: తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట, ముమ్మిడివరం, మండపేట, రాజానగరం
రంగరాయ మెడికల్‌ కాలేజ్, కాకినాడ: అమలాపురం(ఎస్‌సీ), రాజోలు(ఎస్‌సీ), గన్నవరం(ఎస్‌సీ), కొత్తపేట
డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథార్టీ, కాకినాడ: రామచంద్రాపురం
ఐడియల్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్, కాకినాడ: అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి గ్రామీణం
సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్, ఏలూరు: కొవ్వూరు(ఎస్‌సీ), నిడదవోలు, గోపాలపురం(ఎస్‌సీ)
విష్ణు స్కూల్, భీమవరం: నర్సాపురం, భీమవరం
విష్ణు డెంటల్‌ కాలేజ్, భీమవరం: ఆచంట, పాలకొల్లు
బి.సీతా పాలిటెక్నిక్, విష్ణు కాలేజ్, భీమవరం: ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం
రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, ఏలూరు: ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం(ఎస్‌టీ), చింతలపూడి(ఎస్‌సీ)
కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం: నూజివీడు, కైకలూరు, గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు(ఎస్‌సి), పెనమలూరు
ధనేకుల ఇంజనీరింగ్‌ కాలేజీ–గంగూరు: తిరువూరు (ఎస్‌సీ), విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ(ఎస్‌సీ), జగ్గయ్యపేట
నాగార్జున యూనివర్సిటీ, నంబూరు: తాడికొండ (ఎస్‌సీ), మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు(ఎస్‌సీ), గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, వేమూరు(ఎస్‌సీ), రేపల్లె, బాపట్ల
లయోలా పబ్లిక్‌ స్కూల్, నల్లపాడు: పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల
పేస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వల్లూరు: పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు(ఎస్‌సీ)
రైజ్‌ కృష్ణసాయి ప్రకాశం గ్రూపు, వల్లూరు: ఎర్రగొండపాలెం(ఎస్‌సీ), దర్శి, ఒంగోలు, కొండెపి(ఎస్‌సీ)
రైజ్‌ కృష్ణసాయి గాంధీ గ్రూపు, వల్లూరు : మార్కాపురం, గిద్దలూరు
రైజ్‌ కృష్ణసాయి పాలిటెక్నిక్, వల్లూరు: కనిగిరి, కందుకూరు
రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు: ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు(ఎస్‌సీ), పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్‌
రవీంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, కర్నూలు: పత్తికొండ, ఎమ్మిగనూరు
జి.పుల్లయ్య ఇంజనీరింగ్‌ కాలేజ్, కర్నూలు: కోడుమూరు(ఎస్‌సీ), కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజ్, అనంతపురం: రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల(ఎస్‌సీ), అనంతపురం, కళ్యాణదుర్గం
ఎస్‌కే యూనివర్సిటీ, అనంతపురం: రాప్తాడు, మడకశిర(ఎస్‌సీ), హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి
కేఎల్‌ఎం ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్, కడప: బద్వేలు(ఎస్‌సీ), కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్‌సీ), రాయచోటి
గవర్నమెంట్‌ ఉమెన్స్‌ కాలేజ్, నెల్లూరు: కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరుగ్రామీణం, ఉదయగిరి
ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజ్, నెల్లూరు: సర్వేపల్లి, గూడూరు(ఎస్‌సీ), సూళ్లూరుపేట(ఎస్‌సీ), వెంకటగిరి
వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కాలేజ్, పూతలపట్టు: తిరుపతి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు
ఆర్‌కేఎం లా కాలేజ్, పూతలపట్టు: శ్రీకాళహస్తి, సత్యవేడు(ఎస్‌సీ)
శ్రీనివాస ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిమ్మసముద్రం: చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు(ఎస్‌సీ), చిత్తూరు, పూతలపట్టు(ఎస్‌సీ), పలమనేరు, కుప్పం

Related posts