telugu navyamedia
సినిమా వార్తలు

మహర్షి : ఎవరెస్టు అంచున… వీడియో ప్రోమో

Maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి” మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ప్రెస్ మీట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న “మహర్షి” టీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రోమోలను రిలీజ్ చేస్తోంది. ఇక సినిమాలో మొదటగా విడుదలైన చోటి చోటి సాంగ్ వీడియో ప్రివ్యూని నిన్న విడుదల చేశారు.

అందులో మహేష్, పూజా, నరేష్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని చాలా బాగా చూపించారు. చిన్న ప్రోమోనే అయినా ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక తాజాగా “ఎవరెస్టు అంచున… ” సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. మరి మే 9న కాబోతున్న “మహర్షి” ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Related posts