telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

జంతువులు కూడా.. కృత్రిమ గర్భంతో.. పిల్లలు ..

even animals produced through artificial way

ఇప్పటివరకు మనుషులు సంతానం కలగకపోవటంతో కుత్రిమ గర్భధారణ పై ఆధారపడాల్సి వచ్చింది. తాజాగా ఇది జంతువులకు తప్పట్లేదని నిరూపణ అయ్యింది. అదికూడా, మన దేశానికి చెందిన ఖడ్గమృగం అకుటి చరిత్ర సృష్టించింది. ఏడేళ్ల అకుటి కృత్రిమ గర్భధారణ ద్వారా అమెరికాలోని ఫ్లోరిడా జంతుప్రదర్శన శాలలో ఓ పిల్లకు జన్మనిచ్చింది. ప్రకృతి సిద్ధమైన ప్రత్యుత్పత్తికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించినట్టు జూ అధికారులు తెలిపారు.

గతేడాది జనవరి 8న ఓ మగ ఖడ్గమృగం ‘సురు’ నుంచి వీర్యాన్ని సేకరించి ఫలదీకరణం చెందించినట్టు తెలిపారు. అది విజయవంతమైందని, 15 నెలల గర్భం తర్వాత అది పిల్లకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 23న అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో అది ప్రసవించినట్టు తెలిపారు. కృత్రిమ గర్భధారణ ద్వారా ఓ ఖడ్గమృగం బిడ్డకు జన్మనివ్వడం ప్రపంచంలోనే ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఖడ్గమృగం పిల్ల ఆరోగ్యంగా ఉందని వివరించారు.

Related posts