telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వచ్చిన సందర్భాలు లేవు…

ప్రస్తుతం మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కోవిడ్ వ్యాక్సిన్ ‘డ్రై రన్‌’కు ఎంపిక చేసిన కేంద్రం.. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించనుంది.. అనంతరం వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టనున్నారు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది. దీనిపై అన్ని రాష్ట్రాలు ఫోకస్ పెట్టాయి… తెలంగాణ వ్యాప్తంగా రోజుకు 10 లక్ష మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేలా ప్రిపేర్ అయినట్టు వెల్లడించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా సెకండ్ వేవ్ వచ్చిన సందర్భాలు తెలంగాణలో లేవని స్పష్టం చేశారు.. ఇక, బ్రిటన్ నుండి 1200 మంది రాష్ట్రానికి వచ్చారన్న ఆయన.. ఇప్పటికే 900 మందిని ట్రెస్ చేశామని.. వారిలో కూడా ఐదు, ఆరు మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందన్నారు.. మిగతావారి కోసం ట్రేసింగ్ కొనసాగుతోందని వెల్లడించిన మంత్రి ఈటల.. వచ్చే నెల రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ జనవరిలో వచ్చే అవకాశం ఉందని.. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా, కోవిడ్ పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.. మొదటగా… కోవిడ్ వారియర్స్‌కు ఈ వ్యాక్సిన్ పంపిణీ చేయనుండగా.. ఆ తర్వాత వృద్ధులు, చిన్నపిల్లలు, కోవిడ్ బారినపడినవారు.. ఇలా ప్రాధాన్యతను బట్టి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

Related posts