telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాహుల్, లోకేశ్ లా కేటీఆర్ అసమర్థుడు కాదు: మంత్రి ఎర్రబెల్లి

Minister Erraballi comments Congress

సీఎం కావడానికి కేటీఆర్ అన్ని విధాల సమర్థుడని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ రూరల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ లా, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీలా కేటీఆర్ అసమర్థుడు కాదని ఆయన చెప్పుకొచ్చారు.కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తమ పార్టీ అన్ని ఎన్నికల్లో విజయం సాధించిందని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం దేశంలో ప్రభుత్వాన్ని నడపిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించొద్దని మంత్రి ప్రశ్నించారు.

Related posts