telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఎట్టకేలకు నెరవేరిన ఎర్రబల్లి కల

MLA Eraabelli,Laxmiparvati
పాలకుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కీలక నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఈయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రిగా పనిచేయాలనే ఎర్రబెల్లి దయాకర్ రావు కల ఎట్టకేలకు నెరవేరింది. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన కేబినెట్ లో దయాకర్ రావు చోటు కల్పించారు. చాలాకాలంగా టీడీపీలో కొనసాగినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పాలకుర్తి, వర్ధన్నపేట నుండి ఆరు దఫాలుగా టీడీపీ నుంచి  ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
వరంగల్ నుండి ఎంపీగా విజయం సాధించారు. ఈ సారి మాత్రమే ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. గతంలో అన్ని దఫాలు కూడ దయాకర్ రావు టీడీపీ అభ్యర్థిగానే  విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో దయాకర్ రావుకు చోటు దక్కాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో లక్ష్మీపార్వతి తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకొన్నారని ఆయన ప్రకటించారు. జీవితంలో దయాకర్ రావు మంత్రి కాలేడని గతంలో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ కేసీఆర్ దయాకర్ రావుకు మంత్రివర్గంలో చోటు కల్పించారు

Related posts