telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎఫ్-2 : “ఎంతో ఫన్…” వీడియో సాంగ్

F2

దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సినిమా రూపొందుతోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా చేస్తోన్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా… వరుణ్ తేజ్ జోడిగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, నాన్ స్టాప్ నవ్వులతో కొనసాగుతుందని చెబుతున్నారు. ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా సినిమాను తెరకెక్కించారట. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల చేశారు చిత్రబృందం. “ఎఫ్-2” టీజర్ కు, అందులో వెంకీ, వరుణ్ చేసిన సందడికి అద్భుతమైన స్పందన లభించింది. యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో ట్రెండ్ అయ్యింది ఈ టీజర్. తాజాగా ఈ చిత్రం నుంచి “ఎంతో ఫన్…” అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. వెంకటేష్, తమన్నాల మధ్య వచ్చే ఈ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts