telugu navyamedia
study news Telangana trending

కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో … ఆంగ్ల మాధ్యమ తరగతులు ..

english medium classes in kasturiba schools

ఆంగ్ల మాధ్యమం తరగతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానునున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అప్‌గ్రేడ్ కానున్న కస్తూర్బా విద్యాలయాలు, డీఈఓలకు మెయిల్ ద్వారా అందాయి. గతంలో ప్రారంభించిన కస్తూర్బా విద్యాలయాలలో 6వ తరగతి నుంచి తెలుగు మాధ్యమంలో మాత్రమే బోధన జరిగేది. దీనితో తెలుగు మీడియానికి సరైన ఆదరణ లేని కారణంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేది. కొత్తగా ఏర్పాటు చేసిన మరికొన్ని విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

ఈ తరుణంలో మొదట్లో ప్రారంభించిన ఇంకా తెలుగు మాధ్యమంలోనే బోధన కొనసాగుతుంది. విద్యాలయాలకు ఉత్తర్వులు.. రాష్ట్రంలో ఉన్న 97 కస్తూర్బా విద్యాలయాల్లో వచ్చే సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆర్‌సీ నెంబర్ 68/ఎస్‌ఎస్/కేజీబీవీ/టీ9/2019 ద్వారా 16-03-2019న ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను మెయిల్ ద్వారా 20-3-2019న సమగ్ర శిక్ష శాఖ ద్వారా విద్యాలయాలకు అందాయి. ఆ ఉత్తర్వులను అనుసరించి ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, కరీంనగర్, కుమ్రంభీమ్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోని విద్యాలయాల్లో 6వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమం తరగతులు ప్రారంభం కానున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి 2019-20 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో 40 మంది చొప్పున బాలికలను చేర్చుకోనున్నారు. కేజీబీవీలలో ఆంగ్ల మాధ్యమం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరుపేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5వ తరగతి పూర్తి చేయనున్న బాలికలు ఆధార్, తెలుపు రేషన్ కార్డు, 3 ఫొటోలతో ఆంగ్ల మాధ్యమం ప్రవేశం కోరుతూ వారి దరఖాస్తులను వచ్చే నెల 30 తేదీ లోపు విద్యాలయంలో సమర్పించాలి. అవకాశాన్ని నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు సద్వినియోగం చేసుకోవాలి అని అధికారులు కోరుతున్నారు.

Related posts

మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు.. మోడీనే ప్రధాని : గడ్కరీ

vimala p

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష

vimala p

ఎస్వీబీసీ .. భక్తి ఛానల్ కు .. నటుడు పృథ్వీరాజ్ చైర్మన్ ..

vimala p