telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. ఉత్సహంగా క్రికెట్ అభిమానులు.. 213 లక్ష్యంతో ఆతిధ్య జట్టు ..

england target is 213 runs 2019 world cup

నేడు ప్రపంచ కప్ లో భాగంగా ఆతిధ్య జట్టు వెస్టిండీస్ తో తలపడుతుంది. అయితే అక్కడి వారు స్టేడియం లోకి వెళ్లేముందు ఎంచక్కా ఒక బాటిల్ మద్యం కొనుక్కొని తాగుతూ.. ప్లే ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. సాధారణంగా ఇంగ్లాండ్‌లో క్రికెట్ స్టేడియాల్లో మద్యం సేవిస్తూ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు ఉంది. అక్కడ ఎన్నో ఏండ్లుగా ఇలాంటి సంప్రదాయం ఉండటంతో సాధారణంగానే క్రికెట్ ప్రేమికులు మందు తాగుతూ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రప్రంభంలో క్రీడా గ్యాలరీల్లోని చాలా సీట్లు ఖాళీగా ఉండటంతో నిర్వాహకులు అవాక్కయ్యారు. స్టేడియం బయటకు వెళ్లి చూడగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బార్ ముందు ఫ్యాన్స్ క్యూ కట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు. వందలాది మంది మద్యం కోసం వరుసలో నిలబడి ఉండటం విశేషం. ఆరంభంలోనే విండీస్ టపటపా వికెట్లు కోల్పోవడం ఆతర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయకపోవడంతో ఈ మధ్యలో ఓ చుక్కేసి ఊగిపోతున్నారు మందుబాబులు.

ఇక ఆట విషయానికి వస్తే, భారీ స్కోరు చేస్తుందని ఆశించిన వెస్టిండీస్‌ నిరాశపరిచింది. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ధాటికి విలవిల్లాడింది. 44.4 ఓవర్లకు 212 పరుగులకు ఆలౌటైంది. యువ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌(3/30), మార్క్‌వుడ్‌(3/18) కరీబియన్లను భారీ దెబ్బకొట్టారు. కీలక సమయంలో రెండు వికెట్లు తీసి జో రూట్‌ ఆకట్టుకున్నాడు. విండీస్‌లో నికోలస్‌ పూరన్‌(63; 78 బంతుల్లో 3×4, 1×6) కెరీర్లో తొలి అర్ధశతకం సాధించాడు. షిమ్రన్ హెట్‌మైయిర్‌ (39), క్రిస్‌గేల్‌ (36) రాణించారు. ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌, విధ్వంసకర ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ కండరాలు పట్టేయడంతో మధ్యలోనే మైదానం వీడారు.

Related posts