telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. పోరాడుతున్న .. ఆతిధ్య జట్టు..

england won toss chose to bat world cup

గత కొన్నేళ్లుగా సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవాలన్న పట్టుదలతో, అద్భుతరీతిలో సన్నద్ధమైన ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ తో ఫైనల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. వెంటవెంటనే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడిన ఆతిథ్య జట్టును ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు ఉరికిస్తున్నారు. 37 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటూ 13 ఓవర్లలో 93 పరుగులు చేయాలి. స్టోక్స్ 33, బట్టర్ 31 పరుగులతో ఆడుతున్నారు.

Related posts