telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇంగ్లండ్ లో కరోనా బాధితుల కోసం ‘టెస్ట్ అండ్ ట్రేస్’

corona covid

ఇంగ్లండ్ లో కరోనా బారినపడి ఆదాయం కోల్పోయిన వారి కోసం టెస్ట్ అండ్ ట్రేస్’ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐసోలేషన్ కారణంగా ఇంటి వద్ద ఉండి ఆదాయం కోల్పోయిన వారికి ఈ పథకం కింద 500 పౌండ్ల నగదు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ‘టెస్ట్ అండ్ ట్రేస్’లో భాగంగా నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్‌హెచ్ఎస్) నిర్వహించే కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరు ఎవరికి వారే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని, అది వారి చట్టపరమైన విధి అని ప్రభుత్వం పేర్కొంది.

కరోనా వైరస్ మరోసారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ప్రభుత్వం దాని కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎవరైనా ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వేయి యూరోల నుంచి 10 వేల పౌండ్ల వరకు జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.ఈ నిబంధన సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కరోనా రెండోదశ వ్యాప్తి కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. 

Related posts