telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇకపై ఇక్కడ తాగి పడిపోయేవారికి “హ్యాంగ్‌ఓవర్‌ డే” సెలవు

hangover

ఇంగ్లండ్‌లోని ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఈ విషయంలో ఒక ప్రత్యేక వెసులుబాటు కలిపించింది. వాయువ్య ఇంగ్లండ్‌లోని బోల్టన్‌లో గల ‘ద ఆడిట్ ల్యాబ్’ అనే కంపెనీ ‘హ్యాంగ్‌ఓవర్‌ డే’ పేరుతో ఓ వినూత్న సెలవును తమ ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ రాత్రి ఉద్యోగులు ఎవరైనా తాగి, ఉదయానికి కూడా వారికి మత్తు దిగకపోతే ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు. అయితే డ్రింక్ చేయని వారి పరిస్థితి ఏంటని ఆలోచించిన కంపెనీ యాజమాన్యం వారికోసం కూడా ఈ సెలవు విషయంలో ఓ ప్రత్యేక వెసులుబాటు కలిపించింది. రాత్రి ఏదైనా కారణంగా నిద్రపోకుండా ఉండి… ఉదయాన్నే నిద్ర లేవని పరిస్థితి ఏర్పడితే ‘హ్యాంగ్‌ఓవర్‌ డే’ హాలీడేను ఉపియోగించుకోవచ్చని తెలిపింది. దీంతో కంపెనీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ‘హ్యాంగ్‌ఓవర్‌ డే’ సెలవు పేరిట ఈ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

Related posts