telugu navyamedia
study news

20 శాతం ఇంజినీరింగ్ ఫీజులు బాదడానికి సిద్ధం అయిన ప్రభుత్వం…

telangana reservations for panchayat
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 20 శాతం వరకు ట్యూషన్ ఫీజులను పెంచే అవసరం ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు అంచనా వేస్తున్నా రు. వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలను కనీసం 10 శాతం వరకు పెంచాల్సిన అవసరం వస్తుంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రకారం ట్యూషన్ ఫీజులను సమీక్షించాల్సి ఉందని వారు భావిస్తున్నారు.
మొత్తంగా 20 శాతం వరకు ట్యూషన్ ఫీజు లు పెంచే అవకాశముందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ కాలేజీలతో పాటు మెడికల్ కాలేజీల్లోని ట్యూషన్ ఫీజులను సమీక్షించాల్సి ఉంటుంది. దీనిపై కాలేజీల నుంచి ప్రతిపాదనలను స్వీకరించాలని తెలంగాణ అడ్మిషన్ ఫీజ్ అండ్ రెగ్యులేషన్ కమిటీ (టీఏఎఫ్ఫార్సీ) నిర్ణయించింది. మూడు రోజుల్లో టీఏఎఫ్ఫార్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
ప్రస్తుతం టీఏఎఫ్ఫార్సీ చైర్మన్‌గా ఎవరూ లేక పోవడంతో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపారు. ప్రతి ప్రైవేటు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలో ఆదాయ వ్యయాలను అంచనావేసి, ఆ మేరకు కాలేజీల నుంచి ఆడిట్ నివేదికలు, ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు నంబర్లను దరఖాస్తుల ద్వారా స్వీకరించాలని ఫీజుల కమిటీ భావిస్తున్నది. అంతా శాస్త్రీయ పద్ధతిలో, పారదర్శకంగా ఫీజులను సరిచేసే పరిస్థితులున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Related posts

ఇకనుండి.. సంస్కృతి .. పాఠాలలో కూడా…

vimala p

10 నుండే ..పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు..

vimala p

జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీల్లో మార్పులు

vimala p