telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ వడ్డీ జమ

interest rate increased on PF accounts

ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రయోజనాలు పొండనున్నారు. దీపావళి పర్వదినానికి ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ ఉద్యోగుల ఖాతాల్లో 8.65 శాతం వడ్డీ జమ అయింది.

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ లో కానీ, ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కానీ పీఎఫ్ బ్యాలెన్స్‌ వివరాలను తెలుసుకోవ‌చ్చు. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ www.epfindia.gov.in కు లాగిన్ అయి, ఎడ‌మ వైపు ఉండే అవ‌ర్ స‌ర్వీసెస్‌ పై క్లిక్ చేయాలి. అనంతరం ఫ‌ర్ ఎంప్లాయిస్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నెంబ‌ర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేసిన తర్వాత యూఏఎన్ నెంబ‌రు, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి. దీంతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే, మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 77382 99899 కు ఎస్ఎమ్ఎస్ పంపినా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు.

Related posts