telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

కేరళ ఏనుగు మృతిపై పర్యావరణ శాఖ క్లారీటీ!

elephant kerala

కేరళలో ఓ గర్భిణి ఏనుగు పేలుడు పదార్థాలను కలిపిన కొబ్బరి కాయను తిని మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జంతు ప్రేమికులు నిందితులను కఠినంగా శిక్షించాలని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు తేలిపోయింది. ఆ ఏనుగు ప్రమాదవశాత్తూ పేలుడు పదార్థాలను కలిపిన ఆహారాన్ని తిన్నదని ప్రాధమిక దర్యాప్తులో స్థానిక పోలీసులు తేల్చారని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది.

పొలాల్లోకి అడవి పందులు చేరకుండా నిలువరించేందుకు కొందరు స్థానికులు ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన పండ్లను ఎరగా వేస్తారని, అటువంటి ఒక పండునే ఈ ఏనుగు తిన్నదని, ఏదిఏమైనా ఏనుగు మరణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని పర్యావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ ఏనుగు వయసు 15 సంవత్సరాలని, గర్భంతో ఉన్నదని, పండును తినడానికి ప్రయత్నించినప్పుడు అది నోటిలో పేలిపోయి ఉంటుందనే నిర్ధారణకు వచ్చామని పర్యావరణ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

Related posts