telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రెగ్యులరైజ్ చేయాలంటూ విద్యుత్ కార్మికుల ధర్నా

electricity current pole

తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలంటూ విద్యుత్ కార్మికులు హైదరాబాదులో మహా ధర్నా నిర్వహించారు. మింట్ కాంపౌండ్ లో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కార్మికులుగా గుర్తించాలని కోరారు. ఈపీఎస్ఈబీ నిబంధనలను వర్తింపజేయాలని విన్నవించారు.

23,600 మంది ఆర్టిజన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన ఆర్టిజన్ ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగం కల్పించాలని అన్నారు. ఈనెల 23న వరంగల్ లో మహా ధర్నా నిర్వహిస్తామని అన్నారు. తమ సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related posts