telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కమిటీ వేసిన సీఎం జగన్!

apcm committee on school fee

టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయనీ గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కమిటీనీ నియమించారు. గత ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లు, అందుకు చేసుకున్న ఒప్పందాలపై 9 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు.
ఈ కమిటీకి ట్రాన్స్ కో సీఎండీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.

అలాగే ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ టీడీపీ ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన సౌర, పవన విద్యుత్ ధరలను సమీక్షించనుంది. అదే సమయంలో డిస్కంలకు తక్కువ ధరకు విద్యుత్ ను విక్రయించే వారితో ఈ కమిటీ భేటీ కానుంది.

Related posts